Amalapuram: జెడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డా. మహేష్ కుమార్ బాధ్యతలు

Amalapuram: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్ తొలి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ. అభినందించిన జెడ్పీ అధికారులు.

SURESH, AMALAPURAM
Published on: 28 Sept 2026 10:12 PM IST
Amalapuram
X

Amalapuram: జెడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డా. మహేష్ కుమార్ బాధ్యతలు

అమలాపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్,జిల్లా మేజిస్ట్రేట్ డా.ఆర్. మహేష్ కుమార్ ఈ రోజు కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు.నూతనంగా అమలులోకి వచ్చిన ప్రత్యేక అధికారి వ్యవస్థలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్‌కు తొలి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ అధికారులు,సిబ్బంది కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి అభినందనలు తెలియజేశారు.జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవల పర్యవేక్షణ,జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాల సమర్థవంతమైన అమలుపై ప్రత్యేక దృష్టి సారించమని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ ఏవోలు సూర్య ప్రకాష్, చిక్కం నాయుడు,జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM