Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Oct 2026 3:50 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

అమలాపురం: మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయం అమలాపురం కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు బాపు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ మరియు అధికారులు.

జాతిపిత మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలియజేసారు.ఈ రోజు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమైన విషయమని ఆయన తెలియజేశారు. అదే విధంగా 1869 అక్టోబర్2 భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ జన్మించారు.

అతని పూర్తి పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అని,మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రపంచ అహింసా దినోత్సవంగా కూడా పాటిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.నేటి విద్యార్థులు,యువతరం బాపూజీ ఆదర్శాలను స్వీకరించి, దేశ సంక్షేమానికి దోహదపడాలని,గాంధీజీ విద్య, పారిశుధ్యం,8గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

భారతదేశపు ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుందని, గ్రామాలకు సాధికారత కల్పించడం ద్వారా మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన విశ్వసించారు. భారతదేశం అంతటా ప్రార్థనా సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నివాళి కార్యక్రమాలతో గాంధీ జయంతిని జరుపుకుంటారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ చూపిన సత్యం,అహింస అనే మార్గాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.బాపు ఆశయాలను స్మరిస్తూ,ఆయన చూపిన బాటలో నడవడం ద్వారానే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో , డీఆర్‌ఓ వి. సుబ్బారావు,అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు కలెక్టరేట్ ఏవో కె.నాగలక్ష్మమ్మ, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మునికి అంజలి ఘటించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM