Amalapuram: దేవాదాయ కౌలు రైతుల సదస్సు కరపత్రం ఆవిష్కరణ
Amalapuram: అమలాపురంలో దేవాలయ కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రం ఆవిష్కరించారు. ఈనెల 7న విజయవాడలో జరిగే సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
Amalapuram: దేవాదాయ కౌలు రైతుల సదస్సు కరపత్రం ఆవిష్కరణ
అమలాపురం: అమలాపురంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం దేవాలయ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా నాయకుడు బుంగ సత్యనారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ దేవాదాయ భూములను సాగుచేస్తున్న కౌలు రైతులు, సాగుదారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వాతావరణ వైపరీత్యాలు,పెరిగిన పెట్టుబడి వ్యయాల వల్ల కౌలు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈనెల ఏడో తేదీన విజయవాడలో జరిగే దేవాదాయ కౌలు రైతుల రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
దేవాలయ కౌలు రైతుల ప్రధాన కోరికలను నెరవేర్చాలని వారు కోరారు.కౌలు కార్డుల జారీ దేవాదాయ భూములు సాగుచేసే కౌలు రైతులందరినీ గుర్తించి కౌలు కార్డులు ఇవ్వాలి.రుణాలు మరియు బీమా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకుల ద్వారా వడ్డీలేని రూ.2 లక్షల అప్పు ఇవ్వాలి మరియు పంటల బీమా అమలు చేయాలి.
కౌలు చెల్లింపుల సడలింపులు ముందుగా కౌలు చెల్లించాల్సిన అవసరం లేకుండా,పంట వచ్చిన తర్వాత కౌలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి.నష్టపరిహారం ఎల్-నినో,తుఫానుల వలన పంట నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించి, ఆ సంవత్సరానికి కౌలు రద్దు చేయాలి.పాటదారులతో సమానంగా హక్కులు పాటదారులతో పాటు సబ్-లీజు దారులను సగుదారులుగా గుర్తించి, వారికి కూడా క్రాప్ చేసిన పంట రుణాలు ఇవ్వాలి.
రక్షణ కౌలు రైతులు,దేవాదాయ కౌలు రైతులు మరియు సాగుదారుల ఐక్యంగా సమస్యల సాధనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కార్యం వెంకటేశ్వరరావు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్ ఏపీఆర్పిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు,కౌలు రైతులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




