Amalapuram: జనసేన నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో బండి రాధమ్మ

Amalapuram: అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో జనసేన నుంచి బండి రాధమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె రాజకీయ నేపథ్యం, బలాాలపై చర్చ.

SURESH, AMALAPURAM
Published on: 7 Oct 2026 10:02 PM IST
Amalapuram
X

Amalapuram: జనసేన నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో బండి రాధమ్మ

అమలాపురం: బీసీల్లో ఆర్థిక బలం.. అంగబలం.. ప్రజాబలం ఉన్న నాయకురాలిగా బండి రాధమ్మ పేరు దాదాపుగా కరారైనట్లు తెలుస్తుంది.జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితభావంతో సేవ.. వైద్య సేవారంగంలో ఉన్న భర్తతో కలిసి ప్రజలకు చేరువ.

అమలాపురం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ముఖ్యంగా చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు దక్కే అవకాశం ఏర్పడితే ఎవరిని బరిలోకి దింపాలన్న అంశంపై రాజకీయ పార్టీల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి బీసీ మహిళా నాయకురాలు బండి రాధమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ అమలాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లపై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అమలాపురం మున్సిపాలిటీని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ నేతలు వెల్లడించిన నేపథ్యంలో ఆశావహులపై ఆసక్తి పెరుగుతోంది.రాధమ్మకు కలిసి వచ్చే అంశాలు బీసీ వర్గాల్లో బండి రాధమ్మకు ఆర్థిక బలం,అంగబలం, ప్రజాబలం ఉన్నాయి.

రాజకీయంగా పోటీ పడే సమయంలో పార్టీకి అవసరమైన సంస్థాగత బలం,కార్యకర్తలతో సమన్వయం,ప్రజలతో పరిచయాలు వంటి అంశాలు రాధమ్మకు అనుకూలంగా ఉన్నాయని ఆమె వర్గాలు పేర్కొంటున్నాయి.ముఖ్యంగా మహిళా నాయకురాలిగా ప్రజలతో మమేకమై పనిచేయడం,పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, అవసరమైన సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్పందించడం ఆమె రాజకీయ ప్రయాణంలో ప్రత్యేకతగా నిలిచాయని అనుచరులు చెబుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ చర్చల్లో రాధమ్మ పేరు గట్టిగా వినిపిస్తుందని సమాచారం.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్థాయిలో అమలాపురం మున్సిపల్‌ రాజకీయాలపై చర్చలు జరుగుతున్న సమయంలో రాధమ్మ పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోందనే ప్రచారం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జనసేన ఆవిర్భావం నుంచి అంకితభావంతో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి బండి రాధమ్మ పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతూ,పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్థానికంగా మహిళా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొంటున్నారు.

పార్టీకి పదవులు వచ్చిన తర్వాత కాకుండా,పార్టీ నిర్మాణ దశ నుంచే పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వాలన్న చర్చ జరిగితే రాధమ్మ పేరు కూడా పరిగణనలోకి వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.వైద్య సేవా కుటుంబం.. ప్రజాసేవకు మరో బలం వైద్య సేవారంగంలో ఉన్న తన భర్తతో కలిసి ప్రజలకు సేవ చేస్తూ బండి రాధమ్మ మంచి పేరు తెచ్చుకున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.

వైద్య సేవలతో ప్రజలకు దగ్గరగా ఉండే కుటుంబ నేపథ్యం కూడా రాధమ్మకు సామాజికంగా పరిచయాన్ని పెంచిందని వారు పేర్కొంటున్నారు.అవసరమైన వారికి తనవంతు సహాయం చేయడం,ప్రజలతో నేరుగా మమేకం కావడం,మహిళలు మరియు సాధారణ ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా ఆమెకు ప్రత్యేక పరిచయం ఏర్పడిందని అనుచరులు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం

రాజకీయాల్లో పదవి కన్నా ప్రజలతో సంబంధమే ముఖ్యమనే విధానంతో రాధమ్మ ముందుకు సాగుతున్నారని ఆమె వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం, స్థానిక సమస్యలపై స్పందించడం,పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆమెకు రాజకీయంగా బలం చేకూర్చిన అంశాలుగా వారు పేర్కొంటున్నారు.

మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ మహిళకు చైర్‌పర్సన్‌ అవకాశం లభిస్తే, పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వాలన్న వాదనలో భాగంగా రాధమ్మ పేరు ముందుకు వస్తోందని సమాచారం. రిజర్వేషన్‌ ఖరారుపైనే అసలు ఉత్కంఠ ప్రస్తుతం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ,

న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నాయి.పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ,రిజర్వేషన్‌ అంశంపై న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి తుది రిజర్వేషన్‌ ఏ కేటగిరీకి వస్తుందన్నది స్పష్టమైన తర్వాతే అభ్యర్థిత్వంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాధమ్మకు అవకాశం వస్తే బీసీ మహిళకు చైర్‌పర్సన్‌ పదవి కేటాయించే పరిస్థితి ఏర్పడి,జనసేన పార్టీ నుంచి రాధమ్మకు అవకాశం ఇస్తే అది ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి సేవ ప్రజల్లో పరిచయం బీసీ వర్గాల్లో సామాజిక పునాది ఆర్థిక, అంగ, ప్రజా బలం ఉన్న నాయకురాలిగా గుర్తింపు వైద్య సేవా కుటుంబం ద్వారా ప్రజలతో అనుబంధం వంటి అంశాలను ఆమె వర్గాలు ప్రధాన బలాలుగా ప్రస్తావిస్తున్నాయి.

అయితే తుది నిర్ణయం రిజర్వేషన్‌ ఖరారు,కూటమి రాజకీయ సమీకరణాలు, స్థానిక పరిస్థితులు,జనసేన అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.ఈ నేపథ్యంలో అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం బీసీ మహిళకు దక్కే పరిస్థితి వస్తే.. జనసేనలో బండి రాధమ్మకే అవకాశం వస్తుందన్నది ఇప్పుడు అమలాపురం రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM