Amalapuram: జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే ఆనందరావుకు వినతిపత్రం
Amalapuram: అమలాపురంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతిపత్రం సమర్పించారు.
Amalapuram: జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే ఆనందరావుకు వినతిపత్రం
అమలాపురం: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి.వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతిపత్రం అందజేశారు. తొలుత గడియార స్తంభం సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన.అనంతరం ఆయన విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2ను దేశవ్యాప్తంగా కోర్కెల దినంగా పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కోనసీమ జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు మండేలా నాగవెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనందరావుకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ని కోరిన ఏపీయూడబ్ల్యూజే సభ్యులు.ఈ దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,మీడియా సంస్థలు,జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించడంతో పాటు మీడియా ఉద్యోగుల కోసం నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని,ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్‌ను తిరిగి ప్రారంభించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.గతంలో అమలులో ఉన్న 50 శాతం రైలు ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆనందరావు హామీ ఇచ్చినట్లు ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు పరసా సుబ్బారావు,కోశాధికారి మీర్జా వఫా అబ్బాస్,దొమ్మేటి వెంకట్, ఆసు భరత్,రంకిరెడ్డి కృష్ణ,పిల్లి శేఖర్,పిండి శేషు,చవ్వకుల నాని,దుర్గాప్రసాద్,ఆకుల రవితేజ,పి.నాగు, చైతన్య,సతీష్,వెంకన్న,పశ్చిమల విజయ్ ఆంటోనీ,పి.సురేష్ తదితర ఏపీయూడబ్ల్యూజే సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




