Amalapuram: అమలాపురం ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ 13వ బ్యాచ్ ప్రారంభం!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో 13వ బ్యాచ్ శిక్షణ తరగతులను జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు ప్రారంభించారు.
Amalapuram: అమలాపురం ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ 13వ బ్యాచ్ ప్రారంభం!
అమలాపురం: అమలాపురం ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో 13వ బ్యాచ్ కి సంబంధించి16 మంది అభ్యర్థులతో శిక్షణ తరగతులు ప్రారంభించిన జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అమలాపురం డిపోలో నిర్వహిస్తున్న హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో 13వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
ఈ బ్యాచ్‌లో 16 మంది అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు కదిలే దేవుళ్లని,వారి చేతుల్లో ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయని అన్నారు.
డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. సురక్షిత డ్రైవింగ్‌కు ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని డ్రైవింగ్ స్కూల్ ప్రాముఖ్యతను వివరించారు.జిల్లా ప్రజా రవాణా అధికారి జి.సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ శిక్షణ కళాశాలలో డ్రైవర్లకు ప్రాక్టికల్ శిక్షణతో పాటు బస్సుల నిర్వహణ,మెయింటెనెన్స్‌పై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
అమలాపురం డిపో మేనేజర్ ఐ.ప్రేమ్ కుమార్ అభ్యర్థులకు డ్రైవింగ్ శిక్షణ పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇంచార్జ్ ప్రతిమా కుమారి, ఓపీఆర్ఎస్ అండ్ ఎల్ఓ ఇంచార్జ్ ఎన్.వరహాలబాబు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో 14వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ కె.ఎస్.రావును 94407 72183 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.




