Amalapuram: ఎమ్మెల్యే పీఏ నాగబాబు కుటుంబాన్ని పరామర్శించిన కరణ్, సత్య

Amalapuram: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పీఏ నాగబాబు తండ్రి మృతి చెందగా, ఎమ్మెల్యే తనయుడు కరణ్, టీడీపీ నేత మెట్ల సత్య నివాళులర్పించి పరామర్శించారు.

SURESH, AMALAPURAM
Published on: 4 Oct 2026 8:55 PM IST
Amalapuram
X

Amalapuram: ఎమ్మెల్యే పీఏ నాగబాబు కుటుంబాన్ని పరామర్శించిన కరణ్, సత్య

అమలాపురం: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్సనల్ అసిస్టెంట్ (PA) నాగబాబు తండ్రి ఇటీవల స్వర్గస్తులైన సంగతి విదితమే. ఈ విషాద సమయాల్లో నాగబాబు కుటుంబాన్ని ఓదార్చేందుకు ఎమ్మెల్యే తనయుడు అయితాబత్తుల కరణ్ మరియు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తనయుడు మెట్ల సత్య నాగబాబు నివాసానికి వెళ్ళి. నాగబాబు తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం నాగబాబు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే ఆనందరావు తరఫున,తమ కుటుంబల తరఫున గాఢ సానుభూతి తెలిపారు.

ఈ కష్టసమయంలో నాగబాబు కుటుంబానికి ఎమ్మెల్యే కుటుంబం మరియు కూటమి శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని కరణ్,సత్యలు అభయమిచ్చారు. ఈ కార్యక్రమం కూటమి కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM