Amalapuram: వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి
Amalapuram: అమలాపురంలో అగ్నికుల క్షత్రియుల వైసీపీ నాయకుల సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలని కొల్లు త్రినాథ వర్మ పిలుపునిచ్చారు.
Amalapuram: వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి
అమలాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి వర్మ కొనియాడారు.నామినేటెడ్ పదవుల్లో అగ్నికుల క్షేత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలియజేసిన వర్మ.2029 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విజయానికి పనిచేయాలి. ఈ రోజు స్థానిక అమలాపురం ప్రెస్ క్లబ్‌లో అగ్నికుల క్షేత్రియుల వైసీపీ నాయకుల సమావేశం నిర్వహించారు.వైసీపీ ఆర్టీఐ ఐటీ జోన్-2 రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు త్రినాథ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మత్స్యకార నాయకులు, అగ్నికుల క్షేత్రియుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్నికుల క్షేత్రియులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు అగ్నికుల క్షేత్రియులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.నామినేటెడ్ పదవుల భర్తీలో తమ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మత్స్యకారుల సంక్షేమం,ఉపాధి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ఆర్టీఐ ఐటీ జోన్-2 రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు త్రినాథ వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల ఉపాధి, అభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు.మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మత్స్యకారులకు,అగ్నికుల క్షేత్రియులకు తగిన రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ వ్యతిరేకత స్పష్టమవుతుందని అన్నారు.బీసీల్లో రెండవ స్థానంలో ఉన్న అగ్నికుల క్షేత్రియులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు కోరారు.తమ సామాజికవర్గానికి రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.మత్స్యకారులంతా వైసీపీ వెంటే ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు,2029 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విజయానికి అగ్నికుల క్షేత్రియులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా వైసీపీ మత్స్యకార నాయకులు, అగ్నికుల క్షేత్రియుల నాయకులు,పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




