Rajahmundry: రాజమండ్రి మేయర్ సీటు మాదిగలకే ఇవ్వాలి: చిన్న సుబ్బారావు
Rajahmundry: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును మాదిగలకు కేటాయించాలని మహాజన సభ సోషలిస్టు పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు.
Rajahmundry: రాజమండ్రి మేయర్ సీటు మాదిగలకే ఇవ్వాలి: చిన్న సుబ్బారావు
రాజమండ్రి: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ సీటు ను మాదిగలకు కేటాయించాలని మహాజన సభ సోషలిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలుగా మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమండ్రి మేయర్ సీటును మాల సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ చక్రవర్తికి కేటాయించారని, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా మాల సామాజిక వర్గానికి చెందిన బర్రె కొండబాబు ఇచ్చారని అన్నారు. ఇప్పటివరకు మేయర్లుగా బీసీ రిజర్వేషన్ కోటాలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి వీరరాఘవమ్మకు, ఓసి రిజర్వేషన్ కోటాలో పంతం రజిని శేష సాయికి, ఎస్సీ కోటాలో ఎమ్మెస్ చక్రవర్తి కి కేటాయించారని వివరించారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగలకు అనాదిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎస్సీ సామాజిక వర్గంలోనే ఉన్న మాదిగలకు రాజమండ్రి మేయర్ సిటు కేటాయించాలని డిమాండ్ చేశారు. టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేసిన మాదిగల రుణాన్ని మేయర్ సీటు కేటాయించి తీర్చుకోవాలని కోరారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఇప్పటివరకు మాదిగలకు చేసింది ఏమీ లేదని తెలిపారు. ఇప్పటికైనా బుచ్చయ్య చౌదరి మాదిగలకు రాజమండ్రి మేయర్ సీటు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా మాదిగలకు సీటు కేటాయించేలా కృషి చేయాలని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో మాదిగలకు సీటు కేటాయిస్తే ఎస్సీ సామాజిక వర్గంలోని మాల, మాదిగ, రెల్లి కులస్తులు ఐక్యంగా మాదిగ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాదిగలకు ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. 80 సంవత్సరాల కాలంగా మాదిగలను ఓటర్ గానే చూస్తున్నారని అన్నారు.
ఈసారి రాజమండ్రి నగర మేయర్ సీటు ను మాదిగలకు కేటాయించి రాజకీయ అవకాశం కల్పించాలని కోరారు. దళితులలో ఒక కులానికి అవకాశం ఇచ్చినప్పుడు, రెండో కులానికి కూడా అవకాశం ఇవ్వాలని సూచించారు. రాజమండ్రి నగరంలో జనాభాపరంగా మాదిగలు ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. తమకు రెల్లి కులస్తుల సహకారం ఉందని, మాదిగల 100 శాతం ఉంటే, రెల్లి కులస్తులు 40 శాతం మంది ఉన్నారని అన్నారు. మొత్తం మీద మాదిగలకు ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు.
రెల్లీలు అయిన మాదిగ లు అయిన మాల లు అయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిందేనని సీటు ఎవరికి కేటాయించిన కలిసి గెలిపించుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వ ఒకటి గుర్తుంచుకోవాలని టిడిపి, జనసేన, బిజెపి, మూడు పార్టీలు అయితే నాలుగవ పార్టీ ఎమ్మార్పీఎస్ అని తెలిపారు. గత ఎన్నికలలో ఎమ్మార్పీఎస్ మద్దతుతోనే కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని అన్నారు.
మేయర్ సిటీ మాదిగ లకు కేటాయించి రుణం తీర్చుకోవాలని పిలుపు ఇచ్చారు. మాదిగలకు రాజకీయ అవకాశం కల్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకువెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని అన్నారు. మాదిగలకు ఎవరు సీటు కేటాయించిన వార్డుల్లో తిరిగి మాదిగ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు.
ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల వారికి సేవ చేసిందని వివరించారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు జెండాలు మోసే కూలీలు గానే మాదిగలు మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ సీటును మాదిగలకు కేటాయించి కూటమి ప్రభుత్వం మాదిగ రుణం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దొండపాటి క్రిష్టాఫర్ మాదిగ, డాన్ సూరి మాదిగ, అనపర్తి సురేంద్ర మాదిగ, బల్లంకుల రాజు మాదిగ, గంగా దావీదు మాదిగ,ఎలక వెంకట్ రమణ మాదిగ, దొండపాటి పండు మాదిగ, కూరాకుల రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.




