Allavaram: అల్లవరంలో వైయస్సార్సీపీ మండల స్థాయి సమావేశం విజయవంతం
Allavaram: అల్లవరంలో డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ మండల సమావేశం. గ్రామ కమిటీ అధ్యక్షులకు ఐడీ కార్డుల పంపిణీ, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం.
Allavaram: అల్లవరంలో వైయస్సార్సీపీ మండల స్థాయి సమావేశం విజయవంతం
అల్లవరం: అల్లవరం మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ నివాసం నందు అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు కొనుకు బాపూజీ అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశం విజయవంతం నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులకు వారి గ్రామాల వారి ఐడి కార్డులు పంపిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ బలోపేతం వైపు ప్రతియొక్క వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్,మాజీ ఎంపీ చింతా అనురాధ,మాజీ జెడ్పీటీసీ కొనుకు గౌతమి,మాజీ ఎంపీపీ ఇళ్ల శేషారావు,మాజీ సర్పంచ్ సాపేధర్మరాజు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండల అనుబంధ విభాగల సభ్యులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యకర్తలు,నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




