Razole: రేపటి తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం!

Razole: రాజోలు మండల పరిధిలో రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 25 Nov 2026 1:03 PM IST
Razole
X

Razole: రేపటి తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం!

Razole: రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాజోలు మండల పరిధిలో నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి కీలకమైన బ్యాలెట్ బాక్సులను రాజోలు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిబిరం నుంచి సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిబ్బంది సమన్వయంతో ఆయా ప్రాంతాలకు చేరవేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE