Kothapeta: ఘనంగా చెడీ-తాలింఖానా సన్నాహక వేడుకలు!

Kothapeta: అబ్బిరెడ్డి రామదాసు చెడీ-తాలింఖానా 171వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సన్నాహక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 21 Oct 2026 1:58 PM IST
Kothapeta
X

Kothapeta: ఘనంగా చెడీ-తాలింఖానా సన్నాహక వేడుకలు!

Kothapeta: స్థానిక మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు అబ్బిరెడ్డి రామదాసు చెడీ-తాలింఖానా సన్నాహక ప్రదర్శన కార్యక్రమంలో చెడీ-తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్ వీర విద్యనీ ప్రదర్శించారు, ఈ చెడీ-తాలింఖానా వీర విద్య ఆది గురువు అయిన కీ" శే" శ్రీ అబ్బిరెడ్డి రామదాసు (మొదటితరం) 1856 లో సిపాయిల తిరుగుబాటుకి ఒక సంవత్సరం ముందు ఈయన ఈ విద్యకు అంకురార్పణ చేశారు.

స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఇందులో ఇమిడి ఉంది. ఆయన బర్మా ఇప్పటి మయాన్మార్ లో తన మేనమామ దగ్గర ఈ విద్యను అభ్యసించారు. బర్మా కూడా అప్పట్లో అఖండ భారత దేశంలో ఒక భాగం. శ్రీకృష్ణదేవరాయలు సైన్యాధిపతి వారసులుగా ఉండి నేర్చుకున్న విద్య. తదనంతర కాలంలో అఖండ భారత దేశంలో వివిధ ప్రాంతాలలో వ్యాపారాల నిమిత్తం స్థిరపడి శిక్షణ ఇచ్చేవారు.

రామదాసు గారు నేర్చుకున్న విద్యను ఎందరికో తర్ఫీదు ఇచ్చారు, ఈ విద్యను నిశితంగా పరిశీలించిన బ్రిటిష్ ప్రభుత్వం అబ్బిరెడ్డి రామదాసు(1వ తరం)కు తామ్రపత్రం ఇచ్చింది. అప్పట్లో శిక్షణా శిబిరాల కింద వీధుల్లో ఈ చెడీ-తాలింఖానా ప్రదర్శింపబడింది. 1893 పూనా లో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు వినాయక చవితి, దసరా ఉత్సవాలను ఊరేగింపులుగా ప్రదర్శిస్తూ చేసుకోవడం జరిగింది.

ఆయన కుమారుడైన కీ" శే" శ్రీ అబ్బిరెడ్డి నరసింహారావు (2వ తరం) తన తండ్రి ఆశయాలుకు అనుగుణంగా ఈ విద్యను ప్రోత్సహిస్తూ ఈ ఉత్సవాలను దిగ్విజయంగా ముందుకు కొనసాగించారు. అలాగే ఈ చెడీ-తాలింఖానా విద్యని రామదాసు గారి మనవడు మరియు నరసింహారావు గారి రెండవ కుమారుడైన కీ" శే" ఆంధ్రరత్న శ్రీ అబ్బిరెడ్డి రామదాసు(3వతరం) కు వారసత్వంగా నెర్పించారు.

ఆయన ఈ అరుదైన వీర విద్యను ప్రదర్శిస్తూ దాదాపు ఐదున్నర దశబ్దాలు(అర్థ శతాబ్దం) పాటు చెడీ-తాలింఖానా ఉత్సవాల ఖ్యాతిని పెంపొందించుతూ ఈ వీర విద్యకు తగిన గుర్తింపు తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యం పొంది ఆంధ్రరత్న బిరుదుని కూడా సొంతం చేసుకున్నారు.

ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వవేతర సంస్థల నుంచి ప్రశంస పత్రాలు అందుకున్నారు.ఈ విద్యని ప్రస్తుతం రామదాసు కుమారుడు, చెడీ-తాలింఖానా గురువు అయిన అబ్బిరెడ్డి దుర్గా మల్లేశ్వర స్వామి(మల్లేష్)(4వ తరం) వారసత్వంగా కొనసాగిస్తున్నారు. తాను అమెరికా లో ఉంటున్న వాళ్ళ తండ్రి విలువలను పెంచుతూ ప్రతి సంవత్సరం దసరాకి వచ్చి వీర విద్య ప్రదర్శించి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

ప్రతి సంవత్సరం దసరా రోజు ఊరేగింపుగా ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు, ఊరేగింపులో అనేక విధములగు కత్తి వరుసలతో, కర్ర సాములతోనూ, అగ్గి బరాటా, మేలు బాణా, లేడి కొమ్ములు, మార్వాడి కొమ్ములు, బళ్ళెములతోను, జువ్వలు, బాణాలతోను, రింగిల్ బరాటాలతోను, బంతుల తాళ్లతోను, డాలు, కత్తులతోను అనేకమంది అనేక విధముల వరసలతో వివిధ రకములుగా చెడి తాలింఖానా చేస్తారు.

ప్రత్యేక ఆకర్షణ చెడీ-తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్ కళ్ళకు రంగు రంగుల గుడ్డలు కట్టుకొని మనిషి కడుపు పైన కొబ్బరికాయలు, కంఠం మీద బీరకాయలు, అరటికాయలు, దోసకాయలు పలు రకముల కాయలు నరుకుచూ ప్రజావాహిని కళ్ళు మిరుమిట్లు గొల్పునట్లు చెడి తాలింఖానా ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 21 బుధవారం జరగబోయే దసరా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA