Alamuru: కౌలు రైతు బిడ్డ: తమ్మన శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం
Alamuru: కౌలు రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మన శ్రీనివాస్ ఆలమూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
Alamuru: కౌలు రైతు బిడ్డ: తమ్మన శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం
ఆలమూరు: ఆలమూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం సాధారణ కౌలు రైతు కుటుంబం నుంచి ఎదిగి, ప్రజల మధ్య ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు తమ్మన శ్రీనివాస్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని నమ్ముకుని కొనసాగిన నిబద్ధత గల నాయకుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ ప్రజలతో మమేకమైన వ్యక్తి.
చెముడులంక గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ, ఆలమూరు మండల కన్వీనర్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సామాన్యుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో జడ్పీటీసీ అభ్యర్థిగా ముందుకు వచ్చారు.
అధికారం కోసం కాదు.. ప్రజలకు అండగా నిలవడం కోసం! పదవుల కోసం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం!
ప్రజలే బలం.. ప్రజాసేవే లక్ష్యం.. ఇదే తమ్మన శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం!




