Atreyapuram: ఆత్రేయపురం మండలంలో వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్!

Atreyapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్.

TRIMURTULU, KOTHAPETA
Published on: 26 Oct 2026 1:34 PM IST
Atreyapuram
X

Atreyapuram: ఆత్రేయపురం మండలంలో వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్!

Atreyapuram: ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నుండి వీరవల్లి సుబ్రహ్మణ్యం వారి అనుచరులు 25 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.వారందరికీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై ప్రతి గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. వద్దిపర్రు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA