Ankampalem: అంకంపాలెంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 23 కుటుంబాలు!
Ankampalem: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో 23 కుటుంబాలు వైసీపీని వీడి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
Ankampalem: అంకంపాలెంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 23 కుటుంబాలు!
అంకంపాలెం: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులకే ప్రజల మద్దతు ఉంటుందని, వారు భారీ మెజారిటీలతో గెలవడం ఖాయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
ఆత్రేయపురం మండలం అంకంపాలెం లో 23 కుటుంబాలకు చెందిన వారు శుక్రవారం వైసీపీని వీడి సెంట్రల్ డెల్టా వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు సారధ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.వారందరికీ పసుపు కండువాలు కప్పి ఎమ్మెల్యే బండారు సాదరంగా వారిని పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమైందని తెలియజేశారు. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల వైసీపీలోని నాయకులు సైతం కూటమి వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. కూటమికి ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగేది కాదన్నారు.
పల్లెలు అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికల్లో సైతం విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.




