Priya Prakash Varrier: గులాబీ చీరలో 'కన్నుగీటిన సుందరి'.. ప్రియా ప్రకాశ్ వారియర్ క్యూట్ లుక్స్ చూశారా?
Priya Prakash Varrier: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ గులాబీ రంగు చీరలో మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Priya Prakash Varrier: గులాబీ చీరలో 'కన్నుగీటిన సుందరి'.. ప్రియా ప్రకాశ్ వారియర్ క్యూట్ లుక్స్ చూశారా?
Priya Prakash Varrier: తన ఒక్క కంటిచూపుతో, కన్నుగీటే భంగిమతో దేశవ్యాప్తంగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామరస్ అవుట్‌ఫిట్‌లతో పాటు ట్రెడిషనల్ వేర్‌లోనూ మెరిసిపోతూ అలరిస్తుంటుంది.
తాజాగా ఈ భామ గులాబీ రంగు (Pink) చీరలో మెరిసిపోతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. పింక్ శారీకి తగ్గట్టుగా నవ్వులు చిందిస్తూ, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో మళ్లీ రైళ్లు పరిగెత్తిస్తోంది. సంప్రదాయ కట్టుబొట్టులో ఎంతో పద్ధతిగా, దేవకన్యలా కనిపిస్తున్న ప్రియా వారియర్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు "గులాబీ పువ్వులా మెరిసిపోతున్నావ్", "క్యూట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.















