Photo Gallery: భక్తజన సందోహం మధ్య అంబరాన్ని తాకిన బడా గణేశుడి శోభాయాత్ర!

Khairatabad Ganesh Shobha Yatra Photo Gallery:

Arun Chilukuri
Published on: 25 Sept 2026 12:17 PM IST
Photo Gallery
X

Photo Gallery: భక్తజన సందోహం మధ్య అంబరాన్ని తాకిన బడా గణేశుడి శోభాయాత్ర!

Khairatabad Ganesh Shobha Yatra Photo Gallery: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా సాగుతోంది. టస్కర్‌ వాహనంపై కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు శోభాయాత్ర చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఉన్న క్రేన్‌ నంబర్ 5 వద్ద నిమజ్జన కార్యక్రమం పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మార్గమధ్యంలో భక్తుల జయధ్వానాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో నగరమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య యాత్రను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.