Gallery: రాగి పాత్రలో నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Health: రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో, జీర్ణక్రియ నుంచి చర్మం వరకు దాని ప్రభావం గురించి వివరాలు.
copper water
పూర్వీకులు మనకు చెప్పిన ఆరోగ్య సూత్రాల్లో రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం అనేది ఎంతో విలువైనది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా రాగి బిందెలు, గ్లాసులు ఉండేవి. ఇది ఆచారంగా మాత్రమే కాకుండా.. అద్భుతమైన ఆరోగ్య, శాస్త్రీయ కోణాలు కూడా ఉన్నాయి.
రాగి పాత్రలో నీళ్లను నిల్వ ఉంచినప్పుడు రాగి లోహం తనలోని సూక్ష్మ గుణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఇది నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను సంహరించి నీటిని శుద్ధి చేస్తుంది.
రాగి కణాల పునరజ్జీవానికి సహాయపడుతుంది. ఇది చర్మంపై ఉండే ముడతలను తగ్గించి, సహజంగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. మొటిమలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు జీర్ణవ్యవస్థకు అద్భుతమైన వరప్రసాదం. రాగి పాత్రలో నీళ్లు వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణాశయాన్ని, పేగులను శుభ్రపరచడంలో తోడ్పడుతుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్లకు రాగి పాత్రలోని నీళ్లు నేచురల్ ఫ్యాట్ బర్నర్లా పనిచేస్తుంది. రాగి పాత్రలోని నీళ్లు జీవక్రియను వేగవంతం చేస్తాయి.
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయట. ఇవి కీళ్ల మధ్య ఉండే వాపును తగ్గించి, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రాగి నీరు తాగడం వల్ల థైరాయిడ్ లోపం తీరుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో తరుచుగా కనిపించే నీరసం, అలసటను తగ్గించి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది.




