Palm Fruit: తాటి ముంజల్ని ఎవరు తినొచ్చు..ఏ సమయంలో తినాలంటే!

Palm Fruit: వేసవిలో తాటి ముంజలు శరీరానికి చల్లదనం ఇస్తాయి. కానీ వాటిని ఎప్పుడు తినాలి, ఎవరు తినకూడదు అనే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అవసరం.

Ramya Thota
Published on: 13 May 2026 7:13 PM IST
palm fruit
X

palm fruit

నీటి శాతం ఎక్కువగా ఉండే ప్రకృతి ప్రసాదించిన ఓ వరం తాటి ముంజలు. సమ్మర్‌లో వీటికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వేసవి తాపాన్ని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.



తాటి ముంజల్ని తీసుకోవడానికి పగలు అత్యంత అనుకూలమైన సమయం. ముఖ్యంగా మిడ్ - మార్నింగ్ లేదా మధ్యాహ్నం స్నాక్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీటి శాతం అందుతుంది.





రాత్రి సమయంలో తినకపోవడమే మంచిది. రాత్రి పూట అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి పూట వీటిని అవాయిడ్ చేయడమే మంచిది.



డయాబెటిస్‌తో ఉన్నవారు తాటి ముంజల్ని తినొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.





సున్నితమైన జీర్ణశక్తి ఉన్నవారు లేదా తరచుగా కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడేవారు వీటిని అతిగా తినకూడదు.



వీటి చలవ చేసే గుణం వల్ల, జలుబు లేదా దగ్గుతో బాధపడేవారికి సమస్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే వీరు దూరంగా ఉండాలి.








Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story