ఓటీటీల్లో యాడ్స్‌ విసిగిస్తున్నాయా.. ఈ వైరల్ ట్రిక్ ఫాలో చేస్తే సరి..!

JioHotstar Trick: జియోహాట్‌స్టార్‌లో సినిమాలు, కార్యక్రమాల మధ్య వచ్చే ప్రకటనలను తొలగించే ఓ ట్రిక్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Venkat
Published on: 9 Oct 2026 7:35 PM IST
JioHotstar Trick
X

ఓటీటీల్లో యాడ్స్‌ విసిగిస్తున్నాయా.. ఈ వైరల్ ట్రిక్ ఫాలో చేస్తే సరి..!

JioHotstar Trick: జియోహాట్‌స్టార్‌లో సినిమాలు, కార్యక్రమాలు చూస్తున్న సమయంలో వచ్చే ప్రకటనలను తొలగించే ఓ ట్రిక్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక ప్రీమియం చందా తీసుకోకుండానే ప్రకటనలు లేకుండా వీడియోలను చూడవచ్చని ఈ విధానాన్ని ప్రచారం చేస్తున్నవారు చెబుతున్నారు. అయితే ఇది అధికారిక సదుపాయం కాదు. ఓ టెక్నాలజీ లోపం కారణంగా ఇలా జరుగుతున్న అవకాశం ఉందని సమాచారం.

వైరల్‌ అవుతున్న విధానం ప్రకారం, ముందుగా జియోహాట్‌స్టార్‌లో కావాల్సిన సినిమా లేదా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. వీడియో మొదలైన తర్వాత కింద కనిపించే టైమ్‌బార్‌ను పట్టుకుని చివరి ప్రకటన వచ్చే భాగాన్ని కూడా దాటి ముందుకు తీసుకెళ్లాలి. అక్కడ ప్రకటన ప్రారంభమైన వెంటనే వెనక్కి వెళ్లి వీడియోను స్టార్ట్ చేయాలి. అనంతరం అదే కంటెంట్‌ను మరోసారి ప్రారంభించి, మొదట వచ్చే ప్రకటనను పూర్తిగా చూడాలి. ఆ తర్వాత మిగిలిన భాగంలో ప్రకటనలు కనిపించవని ఈ ట్రిక్‌ గురించి ప్రచారం జరుగుతోంది.

ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై స్పష్టమైన అధికారిక వివరణ లేదు. అయితే టైమ్‌బార్‌ను చివరి ప్రకటన వరకు తీసుకెళ్లినప్పుడు, మొత్తం వీడియోతో పాటు మధ్యలోని ప్రకటనలను కూడా చూసినట్లుగా భావించే లోపం ఉండొచ్చని అంచనా.

ఈ విధానం ఎప్పటికీ పనిచేస్తుందని చెప్పలేం. జియోహాట్‌స్టార్‌ సర్వర్లు, వీడియో ప్లేయర్‌లో మార్పులు చేస్తే ఈ లోపాన్ని సరిచేయవచ్చు. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ చూడటానికి అధికారికంగా ప్రీమియం చందానే అందుబాటులో ఉన్న మార్గంగా పేర్కొంటున్నారు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.