Ott Movie: ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోతే..ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్!

Ott Movie: సరికొత్త కథనంతో రూపుదిద్దుకున్న మలయాళం టైమ్ లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Gagan kumar
Published on: 26 Oct 2026 11:39 AM IST
Ott Movie
X

Ott Movie: ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోతే..ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్!

Dhumakethu: ఓటీటీలో కొత్త సినిమాల కోసం ఎదురుచూసే సినీప్రియుల కోసం ఈ వారం ఒక ఆసక్తికరమైన మలయాళం మూవీ డిజిటల్ తెరపైకి వచ్చింది. అదే ‘ధూమకేతు’. కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌కు కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను జోడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సినిమా ప్రితులను ఎంతవరకు అలరిస్తుందో ఓసారి చూద్దాం.

36 ఏళ్ల కుట్టన్ జీవితంలోకి శర్మిల ప్రవేశించడంతో అతడి లైఫ్ పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కిస్తారు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న ఆ దంపతుల జీవితంలో అనుకోని సంఘటనలు కలకలం రేపుతాయి.

పెళ్లి రాత్రి అనుకోకుండా ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు కుట్టాలపై దాడి చేసి అతి క్రూరంగా హత్య చేస్తారు. అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది! చనిపోయిన కుట్టన్ మళ్లీ బతికి తిరిగొస్తాడు. కానీ, అతడికి ఎదురయ్యే పరిస్థితులు మాత్రం మారవు. అదే రోజు, అదే సంఘటనలు, అదే ప్రాణాంతక ప్రమాదం.. ఇలా ప్రతిసారీ ఒకే చక్రంలో కుట్టన్ చిక్కుకుపోతాడు.

ఈ వింత పరిణామాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?. కుట్టన్ ప్రతిసారీ అదే భయానక పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నాడు?. ఈ ఘటనలకు, అతడి గత జీవితానికి ఏదైనా సంబంధం ఉందా?. తన భర్తకు ఎదురుపోతున్న ఈ విపత్కర సమస్యను భార్య శర్మిల ఎలా అర్థం చేసుకుంది?.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘ధూమకేతు’ సినిమా చూడాల్సిందే. సాధారణ కథలకు భిన్నంగా ఒకే రోజు పదేపదే రిపీట్ అవుతున్న పరిస్థితిని ప్రధాన అస్త్రంగా చేసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో ప్రతిసారీ అదే సంఘటనలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ మిస్టరీ వెనుక ఉన్న కారణాన్ని వెతికే తీరు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. సస్పెన్స్‌తో పాటు మంచి హాస్యాన్ని కూడా జోడించడం ఈ సినిమా ప్రత్యేకత.

కుట్టన్ పాత్రలో సజిన్ గోపు తన వింత పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తిగా అద్భుతమైన అభినయం కనబర్చారు. శర్మిల పాత్రలో నిఖిలా విమల్ ఆకట్టుకున్నారు. వీరితో పాటు షైన్ టామ్ చాకో, గణపతి తదితరులు తమ కీలక పాత్రలతో కథను మరింత రక్తి కట్టించారు. దర్శకుడు సుధి మాడిసన్ టైమ్ లూప్ నేపథ్యంలో కామెడీ, ఫాంటసీ అంశాలను చక్కగా మేళవించి సినిమాను తెరకెక్కించారు.

విభిన్నమైన కథాంశాలు, మిస్టరీ, సస్పెన్స్‌తో కూడిన చిత్రాలను ఇష్టపడేవారికి ‘ధూమకేతు’ ఒక మంచి ఆప్షన్. టైమ్ లూప్ కాన్సెప్ట్ మూవీస్‌పై మక్కువ ఉన్నవాళ్ళు ఈ వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.