Markapur: మార్కాపురం జడ్పీ ఛైర్మన్ రేసులో హోరాహోరీ!
Markapur:మార్కాపురం జడ్పీ చైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి, డాక్టర్ రవీంద్ర. టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ సర్వే మొగ్గు ఎటువైపు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ!
Markapur: మార్కాపురం జడ్పీ ఛైర్మన్ రేసులో హోరాహోరీ!
Markapur: మార్కాపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశం తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ పదవికి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి కందుల రామిరెడ్డి, యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
*అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.* ఈ సర్వేలో ప్రజాభిప్రాయం ఎవరికి అనుకూలంగా వ్యక్తమైందన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
నిన్న మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రారంభమైనట్లు సమాచారం. దీంతో కందుల రామిరెడ్డికి ప్రజల మద్దతు ఎక్కువగా లభించిందా? లేక డాక్టర్ మన్నే రవీంద్రకు మొగ్గు చూపారా? అన్న చర్చ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది.
ఇద్దరు నాయకులకూ వారి వారి ప్రాంతాల్లో రాజకీయ పరిచయాలు, అనుచరగణం ఉండటంతో పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఐవీఆర్ఎస్ సర్వేలో ఎవరు ముందంజలో ఉన్నారనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
*మొత్తానికి మార్కాపురం జడ్పీ ఛైర్మన్ పీఠం కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. కందుల రామిరెడ్డికా..? డాక్టర్ మన్నే రవీంద్రకా..? టీడీపీ అధిష్ఠానం ఎవరి పేరును ఖరారు చేస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.*




