Peddaraveedu: పెద్దారవీడులో వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం!
Peddaraveedu: పెద్దారవీడులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపునకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంటింటి ప్రచారం. పోలీసుల తీరుపై ఆగ్రహం, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Peddaraveedu: పెద్దారవీడులో వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం!
Peddaraveedu: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థులను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తూ రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి గోగులముడి శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి కుందూరు అనంతలక్ష్మి, జడ్పీటీసీ అభ్యర్థి పంది సురేఖలను గెలిపించాలని ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాల్సింది పోయి, పోలీసుల ద్వారా వైసీపీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి రాజీ చేసుకునేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో హోంశాఖ, ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారా అంటూ నిలదీశారు. ప్రజల మద్దతు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని చూడటం సిగ్గుచేటని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీలు ఏరువా చలమారెడ్డి, దుగ్గెపూడి వెంకటరెడ్డి, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఏలూరి వెంకటనారాయణరెడ్డి, గ్రామ నాయకులు అల్లు వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీటీసీ గొట్టం గోపాల్‌రెడ్డి, కాసు వెంకటరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




