Giddalur: గిద్దలూరు 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం జోరు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి పల్లె పుల్లారెడ్డి, చైర్మన్ అభ్యర్థి డాక్టర్ భూమా నరసింహారెడ్డి జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Giddalur: గిద్దలూరు 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం జోరు!
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ అభ్యర్థి పల్లె పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ భూమా నరసింహారెడ్డి కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రతి ఇంటిలో ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. రానున్న రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.




