Cumbum: కంభం జడ్పీటీసీగా షేక్ ఇర్ఫాన్ నామినేషన్ దాఖలు
Cumbum: కంభం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జడ్పీటీసీ) అభ్యర్థిగా యువ నాయకుడు షేక్ ఇర్ఫాన్ గురువారం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు.
Cumbum: కంభం జడ్పీటీసీగా షేక్ ఇర్ఫాన్ నామినేషన్ దాఖలు
మార్కాపురం జిల్లా: కంభం మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం (జడ్పీటీసీ) అభ్యర్థిగా యువ నాయకుడు షేక్ ఇర్ఫాన్ గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ సెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా షేక్ ఇర్ఫాన్ మాట్లాడుతూ.. యువతకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత దక్కాలని, నూతన ఆలోచనలతో కంభం మండలాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.




