Markapur: పొదిలిలో కలకలం లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి!
Markapur: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రైవేట్ లాడ్జిలో యువకుడు సయ్యద్ కరిముల్లా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Markapur: పొదిలిలో కలకలం లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి!
Markapur: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని సయ్యద్ కరిముల్లా (22)గా గుర్తించారు.
వివరాల ప్రకారం.. నిశ్చితార్థ వేడుక నిమిత్తం సయ్యద్ కరిముల్లాతో పాటు మరికొందరు యువకులు ఈ నెల 10వ తేదీ రాత్రి లాడ్జికి వచ్చినట్లు సమాచారం. అనంతరం 12వ తేదీన నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించగా, వేడుక పూర్తయిన తర్వాత మిగిలిన వారంతా లాడ్జి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
అయితే లాడ్జిలో రాత్రి సమయంలో ముగ్గురు యువకులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒకరు రాత్రి వెళ్లిపోయినట్లు సమాచారం, మరో యువకుడు ఉదయం లాడ్జికి వచ్చి. గదిలో ఉన్న వారిని నిద్రలేపే ప్రయత్నం చేయగా ఒకరు నిద్రలేచినప్పటికీ, సయ్యద్ కరిముల్లా మాత్రం ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాడ్జి గదిని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, అక్కడ ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యువకుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. లాడ్జిలోని సీసీ కెమెరాల దృశ్యాలు, మృతుడితో ఉన్న వ్యక్తుల వివరాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు పూర్తయిన అనంతరం యువకుడి మృతికి గల పూర్తి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.




