Yerragondapalem: ఎర్రగొండపాలెంలో కూటమి విజయం.. ఎరిక్షన్ బాబు వ్యూహం సక్సెస్

Yerragondapalem: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5 మండలాల్లో కూటమి విజయం. టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబును ఘనంగా సన్మానించిన విజేతలైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 Nov 2026 4:00 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఎర్రగొండపాలెంలో కూటమి విజయం.. ఎరిక్షన్ బాబు వ్యూహం సక్సెస్

ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తనదైన రాజకీయ వ్యూహంతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయనకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల కష్టాలు, పార్టీ బలోపేతంపై పూర్తి అవగాహన ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

నియోజకవర్గంలో పెద్దగా హడావుడి లేకుండా ప్రజల మధ్య ఉంటూ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఐదు మండలాల్లో పార్టీని బలోపేతం చేశారు. తాజాగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు ఐదు మండలాల్లో కూటమి అభ్యర్థులు విజయాలు సాధించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో గూడూరి ఎరిక్షన్ బాబును ఐదు మండలాలకు చెందిన విజేతలైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ.. ఈ భారీ విజయానికి అహర్నిశలు కష్టపడిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని తెలిపారు. ఇదే ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ఐదు మండలాల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లాగా ప్రకటించడం, వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం వంటి అంశాలు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి ప్రజలు తమ విజయాల ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారని టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM