Yerragondapalem: పెద్దారవీడు మండలంలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు

Yerragondapalem: పెద్దారవీడు మండలంలో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. టీడీపీ నేతలు వెల్లడించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Oct 2026 7:07 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: పెద్దారవీడు మండలంలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు

యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పెద్దారవీడు మండలంలో శనివారం (అక్టోబర్ 3) VB G RAM G నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.70 లక్షలతో మూడు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

కార్యక్రమాల వివరాలు:

* ఉదయం 8 గంటలకు: తోకపల్లి పంచాయతీ పరిధిలోని సోమేపల్లిలో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.

* ఉదయం 9 గంటలకు: కంభంపాడు పంచాయతీ పరిధిలోని హనుమాన్ జంక్షన్ కుంట వద్ద మసీదు రోడ్డుకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.

* ఉదయం 10 గంటలకు: స్థానికవరం పంచాయతీ సచివాలయం రోడ్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.

ఈ కార్యక్రమాలకు పెద్దారవీడు మండల టీడీపీ, కూటమి నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస్ రెడ్డి కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM