Markapuram: వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ నిర్వాసితుల జాబితా ప్రచురణ

Markapuram: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 4 ముంపు గ్రామాల పెండింగ్ నిర్వాసితుల జాబితాను పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయంలో ప్రదర్శించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 22 Sept 2026 2:32 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ నిర్వాసితుల జాబితా ప్రచురణ

మార్కాపురం జిల్లా: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్ నిర్వాసితుల జాబితాను పెద్దారవీడు తహసీల్దార్ కార్యాలయంలో ప్రచురించారు.

సుంకేసుల, కలనూతల, చింతలమూడిపి, గుండంచర్ల ముంపు గ్రామాలకు చెందిన పెండింగ్ నిర్వాసితుల జాబితాలను మార్కాపురం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు.

కలెక్టర్ కార్యాలయం నుంచి అందిన జాబితాలను తహసీల్దార్ రామకృష్ణ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు. సంబంధిత గ్రామాల నిర్వాసితులు నోటీసు బోర్డులోని జాబితాను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న నిర్వాసితుల వివరాలపై స్పష్టత తీసుకురావడంతో పాటు తదుపరి చర్యలకు వీలుగా జాబితాల ప్రచురణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM