Markapur: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అధికారుల చుక్కలు
Markapur: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను పదేపదే ధ్రువపత్రాల పేరుతో రెవెన్యూ అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Markapur: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అధికారుల చుక్కలు
మార్కాపురం జిల్లా: తమకు పట్టాలు ఎప్పుడో కేటాయించిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పుడో అందించిన పదేపదే ఇచ్చిన డాక్యుమెంట్స్ మళ్ళీ ఇవ్వాలంటూ ఆఫీసుల చుట్టూ అధికారులు తిప్పుతున్నారు. అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు.. మొదలే కలెక్టర్ ఆఫీస్. పట్టణానికి కొంత దూరం ఉంటుంది. ఏ డాక్యుమెంట్ జిరాక్స్ కావాలన్నా సెంటర్కు రావాల్సిందే... రావడానికి పోవడానికి ఆటోకు చార్జీలు ఎక్కువగా అవుతునడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అధికారులు తమ జిరాక్స్లను పోగొట్టి పదే పదే తమకు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
సర్వం కోల్పోయిన తమకు ఈ ఇబ్బందులు ఏంటి అంటూ కన్నీరు మున్నీరవుతున్న నిర్వాసితులు.




