Markapuram: మార్కాపురంలో ముమ్మరంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాలుగో బ్లాక్‌లో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
Markapuram: మార్కాపురంలో ముమ్మరంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నాలుగో బ్లాక్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.
నాలుగో బ్లాక్ కౌన్సిలర్ అభ్యర్థి ఆలంపల్లి దివ్యకుమారి శ్రీనివాస్‌ను గెలిపించాలని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపి విజయం చేకూర్చాలని వక్కలగడ్డ మల్లికార్జున ఓటర్లను అభ్యర్థించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. మార్కాపురం మున్సిపాలిటీలో టీడీపీ ప్రచార దూకుడు పెంచడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.




