Markapuram: ఎర్రగొండపాలెంలో విషాదం: పిడుగుపాటుకు యువ రైతు మృతి

Markapuram: ఎర్రగొండపాలెం మండలం చెన్నరాయుడుపల్లిలో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై యువ రైతు పోరెడ్డి చెన్నకేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు.

Srikanth Singam, Markapur
Published on: 17 Sept 2026 6:21 PM IST
Markapuram
X

Markapuram: ఎర్రగొండపాలెంలో విషాదం: పిడుగుపాటుకు యువ రైతు మృతి

మార్కాపురం జిల్లా: ఎర్రగొండపాలెం మండలం చెన్నరాయుడుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందాడు. పోరెడ్డి చెన్నకేశవులు, 32, తండ్రి అంజయ్యగా మృతుడిని గుర్తించారు.

మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో దేశినేని కేశవులు, 35, స్వల్పంగా గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చెన్నకేశవులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur