Kanigiri: కనిగిరిలో ఎడ్లబండిపై సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనం!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ కొత్తూరులో డీజే సౌండ్‌కు భిన్నంగా ఎడ్లబండిపై సంప్రదాయబద్ధంగా సాగిన వినాయక నిమజ్జనోత్సవం.
Kanigiri: కనిగిరిలో ఎడ్లబండిపై సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనం!
Kanigiri: ఎడ్లబండిపై సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనం డీజే సౌండ్‌కు భిన్నంగా సంప్రదాయ పద్ధతిలో వినాయక నిమజ్జనాన్ని నిర్వహించారు. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరులో వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రెండు గిత్తలతో ఎడ్లబండిని అలంకరించి, మేళతాళాల నడుమ వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల మాజీ జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కస్తూరి రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే ఆవులు, ఎద్దులంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆ అభిమానంతోనే వినాయక నిమజ్జనాన్ని సంప్రదాయబద్ధంగా రెండు గిత్తలతో ఎడ్లబండి కట్టి నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సంప్రదాయ పద్ధతిలో వినాయకుడిని ఊరేగించి నిమజ్జనం చేయడం ద్వారా సమయానికి వర్షాలు కురిసి, రైతులు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు




