Markapuram: బేస్తవారిపేట MPDO కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Markapuram: బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నామినేషన్ల దాఖలు వేళ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు
Markapuram: బేస్తవారిపేట MPDO కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Markapuram: బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైసిపి అభ్యర్థులను అడ్డుకుంటున్న టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టిడిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. డి.ఎస్.పి సత్యనారాయణ పోలీసు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో గొడవ జరగకుండా అడ్డుకున్నారు.
దీంతో వైసిపి నాయకులు, టిడిపి నాయకులు నిరసనకు దిగారు. నామినేషన్లు వేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చెత్త ప్రభుత్వమని జై జగనంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.




