Markapur: బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసిపి, టిడిపి ఘర్షణ, ఉద్రిక్తత!
Markapur: మార్కాపురం జిల్లా బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి హైకోర్టు పత్రాలు చించివేసిన టీడీపీ నాయకులు, ఆత్మహత్యాయత్నం.
Markapur: బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసిపి, టిడిపి ఘర్షణ, ఉద్రిక్తత!
Markapur: మార్కాపురం జిల్లా బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి గంగయ్య హైకోర్టు రిట్ పిటిషన్ పత్రాలను టిడిపి నాయకులు చించి వేశారు. దీంతో ఆ ప్రాంతంలో వైసిపి, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. నామినేషన్ పత్రాలు అనుకొని టిడిపి నాయకులు హైకోర్టు రిట్ పిటిషన్ పత్రాలు చించివేశారని ఆరోపిస్తున్నారు. ఓటర్ లిస్టులో తన పేరు లేకపోవడంతో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గంగయ్యకు ఓటు హక్కు కల్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అందుకు సంబంధించిన పత్రాలను అధికారులకు సమర్పించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నామినేషన్లు వేయనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని పోలీసుల ముందు వైసిపి నాయకులు పురుగులు మందుల డబ్బాలతో ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారి వద్ద నుంచి పురుగులు మందుల డబ్బాలు బలవంతంగా లాక్కున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు.




