Peddaraveedu: పెద్దారవీడు మండలంలో మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ భారీ ర్యాలీ!
Peddaraveedu: ఒకప్పుడు వైసీపీ కంచుకోట అయిన పెద్దారవీడు మండలంలో టీడీపీ శ్రేణుల భారీ ర్యాలీ. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు, నేతలు.
Peddaraveedu: పెద్దారవీడు మండలంలో మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ భారీ ర్యాలీ!
Peddaraveedu: ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న పెద్దారవీడు మండలంలో టీడీపీ శ్రేణులు భారీగా కదం తొక్కాయి. మండల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, జడ్పీ చైర్మన్ అభ్యర్థి కందుల రామిరెడ్డి పాల్గొని జడ్పీటీసీ అభ్యర్థి చిలక చిన్న నానమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి విజయాన్ని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని నేతలు కోరారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీపీ అభ్యర్థి మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి,మండల నాయకులు చిలక ఇజ్రాయిల్, గొట్టం రామనారాయణరెడ్డి, గొట్టం రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరావు, మండల సీనియర్ నాయకులు సుబ్బరామిరెడ్డి, తిరుమల రెడ్డి శేఖర్ రెడ్డి, బిజెపి నాయకులు కడియం రామయ్య తిరుమల్ రెడ్డి, జీవి రెడ్డి, తిరుమలరెడ్డి ఆంజనేయ రెడ్డి, ఏ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




