Dornala: దోర్నాల జడ్పీటీసీ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి నామినేషన్!

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి నామినేషన్ దాఖలు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆశీస్సులతో నామినేషన్ పూర్తి!

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 Oct 2026 8:09 PM IST
Dornala
X

Dornala: దోర్నాల జడ్పీటీసీ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి నామినేషన్!

Dornala: మార్కాపురం జిల్లా దోర్నాల జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ నాయకుడు కందుల రామిరెడ్డి రెండో విడతలో నామినేషన్ దాఖలు చేశారు. సంప్రదాయబద్ధంగా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల మద్దతుతో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

ముందుగా దోర్నాల మండలంలోని గిరిజన దేవత మంతనాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దోర్నాలలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, అనుచరులు, అభిమానులు, స్థానిక ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని మాట్లాడారు.

తదుపరి తన తల్లిదండ్రుల ఆశీస్సులు పొందడంతో పాటు, తన సోదరుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం మార్కాపురంలోని మెప్మా కార్యాలయంలో దోర్నాల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

తల్లిదండ్రుల ఆశీస్సులు, దైవదర్శనంతో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించిన కందుల రామిరెడ్డి అభ్యర్థిత్వంతో దోర్నాల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరింత పెరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM