Darsi: దర్శిలో వైసీపీ కనుమరుగు అవ్వాలి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి!
Darsi: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 ശాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తామని, దర్శి నియోజకవర్గంలో వైసీపీని తిరస్కరించాలని టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు.
Darsi: దర్శిలో వైసీపీ కనుమరుగు అవ్వాలి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి!
Darsi: దర్శి టిడిపి కార్యాలయం లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం పై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని వివరించడంతోపాటు, ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని ఎండగడుతూ సమావేశంలో చర్చించారు. Dr. లక్ష్మీ గారితో పాటు నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర గారు నియోజకవర్గం లోని బిసి సోదరులు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో వైసీపీ కనుమరుగు అవ్వాలని, బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.




