Markapur: ఎగువ చెర్లోపల్లిలో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు!

Markapur: దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లిలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు రూ.7.80 కోట్ల తారు రోడ్డు పనులతో పాటు వివిధ అభివృద్ధి ప్రారంభించారు.

Srikanth Singam, Markapur
Published on: 8 Oct 2026 2:59 PM IST
Markapur
X

Markapur: ఎగువ చెర్లోపల్లిలో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు!

Markapur: దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పలు నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు.

రూ.47.60 లక్షల నిధులతో నిర్మించిన స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని, రూ.23.80 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. అలాగే రూ.28.30 లక్షల నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ భారత్–హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించారు.

పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా VB-G RAM G నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చిలకచర్ల గూడెం నుంచి పలుకుమడుగు గ్రామం వరకు రూ.7.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తారు రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రహదారులు, ఆరోగ్య సేవలు, పరిపాలనా సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

కార్యక్రమంలో దోర్నాల మండల అధికారులు, మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ మాబు, మండల సీనియర్ నాయకులు, ఎగువ చెర్లోపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur