Markapuram: మార్కాపురంలో జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అనుకూల పవనాలు: వార్ వన్ సైడ్

Markapuram: మార్కాపురం జిల్లా జడ్పీటీసీ ఎన్నికల్లో కందుల రామిరెడ్డి అభ్యర్థిత్వంతో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. 12 స్థానాల్లో ఏకపక్ష ఓటింగ్ జరుగుతోందని సమాచారం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 5 Nov 2026 2:26 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అనుకూల పవనాలు: వార్ వన్ సైడ్

మార్కాపురం జిల్లా: మార్కాపురం జిల్లా జడ్పీటీసీ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. జిల్లాలో మొత్తం 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో మూడు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ విషయంలో వెనుకడుగు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇక మిగిలిన 12 స్థానాల్లోనూ టీడీపీకి అనుకూలంగా ఏకపక్ష ఓటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మార్కాపురం జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కందుల రామిరెడ్డిని ప్రకటించిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారినట్లు తెలుస్తోంది.

కందుల రామిరెడ్డికి జిల్లావ్యాప్తంగా ఉన్న పరిచయాలు, ఆప్యాయతతో కూడిన సంబంధాలు, బంధువర్గం అండగా నిలవడం ఆయనకు అదనపు బలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన విజయానికి ప్రతిపక్ష వర్గాల నుంచి కూడా పరోక్ష సహకారం అందుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మొత్తంగా చూస్తే మార్కాపురం జిల్లా జడ్పీటీసీ ఎన్నికల బరిలో టీడీపీ ఆధిపత్యం కనిపిస్తోందని, వైఎస్సార్‌సీపీ శ్రేణులు డీలా పడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తుది ఫలితాలు వెలువడితేనే ఎన్నికల అసలు చిత్రం స్పష్టమవుతుంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM