Markapuram: మార్కాపురం 5వ వార్డులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ ప్రచారం!
Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ 5వ వార్డులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Markapuram: మార్కాపురం 5వ వార్డులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ ప్రచారం!
Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఐదో వార్డులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున, మాజీ మున్సిపల్ చైర్మన్ ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
మార్కాపురం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని, ప్రజల ఆశీర్వాదం అందించాలని వక్కలగడ్డ మల్లికార్జున కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




