Giddalur: గిద్దలూరు 12వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ముబీన విస్తృత ప్రచారం!
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ముబీన స్థానిక నాయకులతో కలిసి విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Giddalur: గిద్దలూరు 12వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ముబీన విస్తృత ప్రచారం!
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ 12 వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్. ముబీన ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులతో కలిసి వార్డులో పర్యటిస్తున్నారు.
ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా కూటమి ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తు ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు.
స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఓటర్లకు భరోసా ఇస్తు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, నవంబర్ 1న జరగబోయే ఎన్నికల పోలింగ్‌లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఈ ప్రచారంలో పార్టీ స్థానిక నాయకులు లతీఫ్ ఖాన్, షేక్ . షూకూర్ , మహమ్మద్ హుస్సేన్, షారుక్ ఖాన్, షాహిద్ ఖాన్ , జిలానీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




