Komarolu: కొమరోలులో నిలిచిపోయిన 'సుభోజనం' సేవా కార్యక్రమం!
Komarolu: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా మార్కాపురం పరిధిలోని కొమరోలు మండలంలో 'సుభోజనం' పథకం నిలిచిపోయింది.
Komarolu: కొమరోలులో నిలిచిపోయిన 'సుభోజనం' సేవా కార్యక్రమం!
Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో కమూరి ఆధ్వర్యంలో నడుస్తున్న సుభోజనం కార్యక్రమానికి స్థానిక ఎన్నికల సందర్భంగా నిలిపివేయడం జరిగింది. దీంతో నిరుపేదలైన కదలలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.
ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పేద ప్రజలకు ఇంటింటికి అందిస్తున్న భోజన సదుపాయం సేవలకు అంతరాయం కలగడం అనేది చాలా దురదృష్ట కరం. మానవతా దృక్పథంతో అధికారులు స్పందించి శుభోజనం కార్యక్రమం సేవా కార్యక్రమం కాబట్టి దాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.




