Kanigiri: కనిగిరిలో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం, లడ్డూ వేలంపాట!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరిలో గణపతి లడ్డూ వేలంపాట హోరాహోరీ. రూ.2,05,116లకు 60 కిలోల లడ్డూ దక్కించుకున్న మాజీ కౌన్సిలర్ రామనబోయిన శ్రీనివాసులు యాదవ్.
Kanigiri: కనిగిరిలో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం, లడ్డూ వేలంపాట!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని 9వ వార్డు వాల్మీకి వీధిలో కొలువైన భారీ గణనాథుని నిమజ్జనోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి గణపతి లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో 60 కిలోల బరువున్న గణపతి లడ్డూను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ రామనబోయిన శ్రీనివాసులు యాదవ్ (ఆర్ఎస్ఆర్) రూ.2,05,116లకు దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రామనబోయిన శ్రీనివాసులు యాదవ్‌కు లడ్డూను అందజేశారు. అనంతరం తప్పెట్ల మేళతాళాల నడుమ భక్తిశ్రద్ధలతో లడ్డూను ఊరేగింపుగా ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.




