Markapur: మార్కాపురంలో జడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ!

Markapur: మార్కాపురం మెప్మా కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Oct 2026 3:41 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో జడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ!

Markapur: మార్కాపురం పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ తనిఖీ చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, బందోబస్తు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC)ని కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని, తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో ఎస్పీబీ సీఐ మధుబాబు, పట్టణ సీఐ అల్తాఫ్ హుస్సేన్ పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM