Prakasam: చీమకుర్తిలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ!

Prakasam: చీమకుర్తిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. భద్రతపై అధికారులకు కీలక ఆదేశాలు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 16 Oct 2026 12:45 PM IST
Prakasam
X

Prakasam: చీమకుర్తిలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ!

Prakasam: ఎస్పీ హర్షవర్ధన్ రాజు చీమకుర్తి పట్టణంలో పర్యటించారు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నామినేషన్లు జరుగు ప్రదేశాన్ని మరియు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను చెక్‌పోస్టులను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేయాలని, చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.వీరి వెంట DSP రాయపాటి శ్రీనివాసరావు, CI దాసరి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam