Markapuram: శ్రీశైల తూర్పు ద్వారం త్రిపురాంతకం క్షేత్రంలో బీజేపీ నేత ప్రత్యేక పూజలు!
Markapuram: త్రిపురాంతకంలో ప్రసిద్ధ బాలా త్రిపురసుందరీ అమ్మవారు, త్రిపురాంతకేశ్వర స్వామివార్లను బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించి పూజలు చేశారు.
Markapuram: శ్రీశైల తూర్పు ద్వారం త్రిపురాంతకం క్షేత్రంలో బీజేపీ నేత ప్రత్యేక పూజలు!
Markapuram: మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాలా త్రిపురసుందరీ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుమారగిరిపై కొలువైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సోము వీర్రాజుకు ఆలయ చరిత్ర, పురాణ ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక విశిష్టతలను వివరించారు. బాలా త్రిపురసుందరీ అమ్మవారి ఆలయ ప్రాశస్త్యంతో పాటు, కుమారగిరిపై స్వయంభువుగా వెలసిన త్రిపురాంతకేశ్వర స్వామివారి విశిష్టతను తెలియజేశారు.
శైవ, వైష్ణవ సంప్రదాయాల మేళవింపుతో త్రిపురాంతకం ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపు పొందిందని వివరించారు. శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా త్రిపురాంతకానికి ఉన్న ప్రాధాన్యతను, స్థానిక పురాణ సంప్రదాయాల్లో ప్రస్తావించే బిలమార్గం విశేషాలను తెలియజేశారు. ఆలయ పరిసరాల్లోని ప్రాచీన శిల్పాలు, రాతి కట్టడాలు, నిర్మాణ శైలిలోని ప్రత్యేకతలను కూడా వివరించారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బాలా త్రిపురసుందరీ అమ్మవారి కరుణాకటాక్షాలు, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.




