Markapuram: మార్కాపురం 31వ వార్డు కౌన్సిలర్‌గా ఎస్కే. నజీరున్నిస ఏకగ్రీవం!
Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా ఎస్కే. నజీరున్నిస ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Markapuram: మార్కాపురం 31వ వార్డు కౌన్సిలర్‌గా ఎస్కే. నజీరున్నిస ఏకగ్రీవం!
Markapuram: మార్కాపురం మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా ఎస్కే. నజీరున్నిస ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన మాజీ కౌన్సిలర్ మయూరి ఖాసిం, టీడీపీ నాయకులు ఆదాం, బోధనపు వెంకటరెడ్డి, సయ్యద్ బాబులను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున అభినందించారు.
ఈ సందర్భంగా వార్డు నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కాగా, మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున ప్రచారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ ప్రచార కార్యక్రమాన్ని వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కౌన్సిలర్ ఎస్కే. నజీరున్నిస, మాజీ కౌన్సిలర్ మయూరి ఖాసిం కోరారు.




