Bestavaripeta: బేస్తవారిపేట సీనియర్ టీడీపీ నేత దూదేకుల ఆదామ్ హఠాన్మరణం!
Bestavaripeta: బేస్తవారిపేట మండల సీనియర్ టీడీపీ నాయకులు దూదేకుల ఆదామ్ హఠాన్మరణం చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
Bestavaripeta: బేస్తవారిపేట సీనియర్ టీడీపీ నేత దూదేకుల ఆదామ్ హఠాన్మరణం!
బేస్తవారిపేట: మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల సీనియర్ టీడీపీ నాయకులు దూదేకుల ఆదామ్ హఠాత్తుగా మృతి చెందారు. నిత్యం అందరితో కలివిడిగా ఉంటూ, ప్రజల్లో మమేకమైన ఆయన సడన్‌గా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆదామ్ హఠాన్మరణ వార్త తెలియగానే బేస్తవారిపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ జెండాను భుజాన మోస్తూ.. మండలంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఆయన పార్థివ దేహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు నేతలు పేర్కొంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.




