Chimakurthy: మా చెరువు భూమిని కాపాడండి.. చీమకుర్తి గ్రామస్తుల ఆవేదన!
Chimakurthy: చీమకుర్తి మండలం పాటిమీదపాలెం సమీపంలోని పెద్ద చెరువు స్థలాన్ని చదును చేసి వరి కయ్యలు కట్టి ఆక్రమించే ప్రయత్నాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chimakurthy: మా చెరువు భూమిని కాపాడండి.. చీమకుర్తి గ్రామస్తుల ఆవేదన!
చీమకుర్తి: చీమకుర్తి మండలంలోని చీమకుర్తి నుండి పాటిమీదపాలెం వరకు ఉన్న పెద్ద చెరువు స్థలాన్ని పాటిమీదపాలెం సమీపాన చెరువు కట్టకు తారు రోడ్డుకు మధ్యన ఉన్న స్థలాన్ని కొందరు అక్రమార్కులు చదును చేసుకొని వరి కయిలు కట్టి ఆక్రమించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
తక్షణమే ఈ ఆక్రమనలను అరికట్టి ప్రభుత్వ చెరువు స్థలాన్ని కాపాడి చదును చేసిన అక్రమార్కులపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మున్సిపల్ ప్రభుత్వ అధికారులు ఇకనైనా నిద్ర మొత్తం వీడి ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు.




